నా పేరే తెలియని
Na Pere Teliyani
06 Jan 2026
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా || 2 ||
వెళతారా – నా ప్రేమను చెబుతారా || 2 ||
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో || 2 || ||ఎవరైనా||
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు || 2 || ||ఎవరైనా||
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి || 2 || ||ఎవరైనా||