బ్రతుకుట నీ కోసమే
Bratukuta Ni Kosame
06 Dec 2025
బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు || 2 ||
సిలువ వేయబడినానయ్యా || 2 ||
నీవే నాలో జీవించుమయ్యా || 2 ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా || 2 ||
ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద || 2 ||
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా || 2 ||
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా || 2 ||
సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా||
లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన || 2 ||
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా || 2 ||
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా || 2 ||
ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||