మేలు చేయక నీవు ఉండలేవయ్యా
Melu Ceyaka Nivu Undalevayya
Job Das
07 Dec 2025
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా || 2 ||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా || 2 || ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక || 2 ||
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా || 2 ||
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే || 2 ||
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ || 2 ||
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో || 2 ||
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని || 2 ||
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||