నీవే నా సంతోషగానము
Nive Na Santosaganamu
Hossanna Ministers
07 Dec 2025
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము || 2 ||
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు || 2 || ||నీవే నా||
ఓ లార్డ్ యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్ ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు || 2 ||
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో || 2 || ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు || 2 ||
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం || 2 || ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు || 2 ||
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు || 2 || ||నీవే నా||