దావీదు కుమారుడా

Davidu Kumaruda

Bro. Shalem Raju Garu 08 Dec 2025
దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా || 2 || నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా || 2 || కుంటి వాడినయ్య - నా తోడు నడువవా || 2 || || దావీదు || లోకమంత చూసి - నను ఏడిపించినా జాలితో నన్ను - నీవు చేరదీయవా ||2 || ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా || 2 || || దావీదు || నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన ||2|| తల్లితండ్రి నీవై నను లాలించుమా || 2 || || దావీదు ||