జీవజలమా ఆత్మనాథుడా
Jivajalama Atmanathuda
R R K Murthy
20 Dec 2025
జీవజలమా ఆత్మనాథుడా - ఎండని నదిలాగా రమ్ము బోధకా || 2 ||
రండయ్యా బోధకుడా|| 2 ||
ఎండని జీవనదిలాగా|| 2 ||
పాదాల కొలత సరిపోదయ్యా - మోకాళ్ల లోతు సరికాదయ్యా || 2 ||
ఈతలా మునిగి లేవాలయ్యా || 2 ||
తేలి తేలి ఆడాలయ్యా || 2 || || రండయ్యా బోధకుడా ||
పోవు స్థలమెల్లా ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే || 2 ||
చేరు దాపంతా సంతృప్తియే || 2 ||
నిలుచు మేరంతా పుష్టికరమే || 2 || || రండయ్యా బోధకుడా ||
కోట్లకోట్ల జాలర్ల గుంపు - పరుగు పరుగున వల వేయాలి || 2 ||
పాడి పాడి చేపలు పట్టి || 2 ||
పరమ దేవునికి ప్రజను చేర్చాలి || 2 || || రండయ్యా బోధకుడా ||
ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి ధారాళంగా || 2 ||
ఔషధమవ్వాలి ఆకులన్నీ || 2 ||
ఆహారమవ్వాలి పండులన్నీ|| 2 || || రండయ్యా బోధకుడా ||