చాలునయ్యా చాలునయ్యా

Chalunayya chalunayya

28 Oct 2025
చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా || 2 || ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు || 2 || తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే || 2 || ప్రేమా కరుణా నీ కృప చాలు || 2 || ||చాలునయ్యా|| జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా || 2 || హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు || 2 || ||చాలునయ్యా|| బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా || 2 || నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు || 2 || ||చాలునయ్యా||