చెమ్మగిల్లు కళ్ళలోన

Chemma gillu kallalon

Bro. Shalem Raju Garu 08 Dec 2025
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం || 2 || విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 || || చెమ్మగిల్లు || నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె || 2 || నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే || 2 || విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 || || చెమ్మగిల్లు || అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే || 2 || మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే || 2 || విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || చెమ్మగిల్లు ||