అడగక మునుపే
Adagaka Munupe
Hosanna Ministries
09 Jun 2026
అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?
నాకు సహాయము చేయుటకై – నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై – ఉపకరములెన్నో చేసితివే
హల్లెలూయ – ఉపకరములెన్నో చేసితివే ||అడగక||
నాకు దీర్గాయువునిచ్చుటకే – నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నేపొందుటకు – పునరుత్థానము నొందితివే
హల్లెలూయ – పునరుత్థానము నొందితివే ||అడగక||
నాకు ఐశ్వర్యమునిచ్చుటకే – నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే – మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ – మహిమాత్మతో నన్ను నింపితివే ||అడగక||