అతి సుందరుడవు
Ati Sundarudavu
Hosanna Ministries
09 Jun 2026
అతి సుందరుడవు యేసయ్యా
మనోహరుడవు నీవయ్యా
యదార్ధ వంతుల సభలో - పరిశుద్దులతో కలిసి
నిను అరాధించెదను .... || 2 ||
అతి సుందరుడా మనోహరుడా ..
ఆరాధనకు యోగ్యుడవు .. స్థుతులకు పాత్రుడవు .. || 2 ||
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా గలదు
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించేదను
పరవశించి పరవళ్లు తొక్కి ఆరాధించేదను || 2 || || అతి సుందరుడవు ||
అమూల్యములైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు
అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు
విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను
సంపూర్ణతకై పరిశు ద్ధుడనై అరాధించెదను || 2 || || అతి సుందరుడవు ||
మహా రాజువై సీయోనులో యేలుచున్నావు
పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు
సౌందర్యము గల సీయోనులో ప్రకాశించు చున్నావు
నీ మహిమను పొంది నీ దరి చేరి అరాధించెదను || 2 ||
అతి సుందరుడా మనోహరుడా
ఆరాధనకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు || 2 || || అతి సుందరుదవు ||