అదిగదిగో పరలోకము
Adigadigo Paralokamu
Hosanna Ministries
09 Jun 2026
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము - వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది || 2 ||
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే || 2 ||
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే - పరిపూర్ణమైన పరిశుద్ధులతో || 2 || || అదిగదిగో ||
కల్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూ నే పరవసింతునే || 2 ||
రాజాధిరాజు తో స్వప్నాల సౌధములో
విహరింతునే- నిర్మలమైన వస్త్రధారినై || 2 || || అదిగదిగో ||
జయించిన వాడై సర్వాధి కారియై
సింహాసనా సీనుడై నను చేర్చుకొనును || 2 ||
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే - వేవేల దూతల పరివారముతో || 2 || || అదిగదిగో ||