అల్ఫా ఒమేగయైన

Alpha Omegayaina

Hosanna Ministries 09 Jun 2026
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా || 2 || రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా || 2 || ||అల్ఫా|| కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను || 2 || జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే || 2 || ||అల్ఫా|| తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను || 2 || నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే || 2 || ||అల్ఫా|| నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను || 2 || నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే || 2 || ||అల్ఫా||