అవధులే లేనిది
Avadhule Lenidi
Hosanna Ministries
09 Jun 2026
అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది || 2 ||
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది || 2 || ||అవధులే||
ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు || 2 ||
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును || 2 || ||అవధులే||
సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు || 2 ||
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును || 2 || ||అవధులే||
లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు || 2 ||
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద || 2 || ||అవధులే||