పరిశుద్ధ ఆత్ముడా

Parisud'dha Atmuda

Hosanna Ministries 09 Jun 2026
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా || 2 || సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పడే దిగిరమ్మయా || 2 || నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా || 2 || యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయ్యా || 2 || నన్ను యేసువలే మార్చుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయ్యా || 2 || || ఆత్మ || తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయ్యా || 2 || నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || ఆత్మ || నీతోనే ఉండాలని నీతో ఏకం కావాలని నా ఆశయ్యా || 2 || నాతో సదకాలం ఉండుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || ఆత్మ || సత్యములో నడవాలని సత్యం నాకు తెలియాలని నా ఆశయ్యా || 2 || సర్వసత్యములో నడుపుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || ఆత్మ ||