ఆదరణ కర్తవు
Adarana Kartavu
Hosanna Ministries
09 Jun 2026
ఆదరణ కర్తవు అనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు || 2 ||
అల్పుడనైయున్న నన్ను చేరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై || 2 || || ఆదరణ ||
నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు || 2 || || ఆదరణ ||
యేసయ్య! నా యేసయ్య!
యేసయ్య! నా యేసయ్య!!