ఇంతగ నన్ను
Intaga Nannu
Hosanna Ministries
09 Jun 2026
ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపమునాలో - రూపించుటకా || 2 ||
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా || 2 ||
శిలనైనా నన్ను - నీవలె మార్చుటకా
శిల్ప కారుడా - నా యేసయ్యా
మలుచు చుంటివా - నీ పోలికగా || ఇదియే ||
తీగలు సడలి - అపస్వరములమయమై
మూగబోయనే - నా స్వర మండలము || 2 ||
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా - పలికించితివా || ఇదియే ||