ఊహలు నాదు ఊటలు

Uhalu Nadu Utalu

Hosanna Ministries 09 Jun 2026
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి || 2 || ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు || 2 || ||ఊహలు|| నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా || 2 || నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు || 2 || ||ఊహలు|| శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా || 2 || జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు || 2 || ||ఊహలు|| ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే || 2 || ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే || 2 || ||ఊహలు||