ఎన్నెన్నో మేళ్లను
Ennenno Mellanu
Hosanna Ministries
09 Jun 2026
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను
ఏమని ఎన్నని వివరించగలను
యుగ యుగాలలో ఎన్నెన్నో
అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే
పోరాడుచున్నను || 2 || || ఎన్నెన్నో||
స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో
స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది || 2 ||
స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును
చిత్త శుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది || 2 || || ఎన్నెన్నో ||
భూనివాసులందరి లో గొర్రె పిల్ల రక్తము తో
కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది || 2 ||
క్రీస్తు యేసు మూల రాయి యై
అమూల్యమైన రాళ్ళమై
ఆయనపై అమర్చబడుతూ వృద్ధినొందుచు సాగెదము || 2 || || ఎన్నెన్నో||