చూచుచున్న దేవుడవు

Chuchuchunna Devudavu

Hosanna Ministries 09 Jun 2026
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము || 2 || పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో || 2 || ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా || 2 || ||చూచుచున్న|| అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా || 2 || అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా || 2 || ||చూచుచున్న||