కృపలను తలంచుచు
Krupalanu Thalanchuchu
Hosanna Ministries
28 Oct 2025
కృపలను తలంచుచు || 2 ||
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ || 2 || ||కృపలను||
కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో || 2 ||
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు) || 2 || ||కృపలను||
రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను || 2 ||
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు) || 2 || ||కృపలను||
సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి || 2 ||
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో) || 2 || ||కృపలను||
హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే || 2 ||
సీయోను నివాసం నాకెంతో ఆనందం