కృపామయుడా – నీలోనా

Krupamayuda Nilona

Hosanna Ministries 28 Oct 2025
కృపామయుడా – నీలోనా || 2 || నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక || 2 || నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున || 2 || ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా || 2 || రాజవంశములో యాజకత్వము చేసెదను || 2 || ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు || 2 || నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు || 2 || ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు || 2 || నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను || 2 || ||కృపామయుడా||