కృప వెంబడి కృపతో
Krupa Vembadi Krupato
28 Oct 2025
కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా || 2 ||
నను కరుణించిన నా యేసయ్యా || 2 || ||కృప||
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా || 2 ||
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా || 2 ||
నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని || 2 ||
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా || 2 ||
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||