కృపానిధి నీవే ప్రభు
Krupanidhi Nive Prabhu
Hosanna Ministries
09 Jun 2026
కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2||
నీ కృపలో నన్ను నిలుపుము ||2||
నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా||
నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది ||2||
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా||
నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను ||2||
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది ||2|| ||కృపా||
నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును ||2||
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును ||2|| ||కృపా||
ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము ||2||
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు ||2|| ||కృపా||