మహోన్నతుడా నీ కృపలో
Mahonnatuda Ni Krupaalo
Bro. Yesanna Garu
01 Feb 2026
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట ||2|| ||మహోన్నతుడా||
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు ||2||
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు ||2|| ||మహోన్నతుడా||
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా ||2||
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా ||2|| ||మహోన్నతుడా||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా ||2||
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా ||2|| ||మహోన్నతుడా||