దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి
Devaloka Stotraganam Devadi Devuniki
31 Dec 2025
దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం || 2 ||
దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం – గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం || 2 ||
క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై || 2 || (దేవలోక)
భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు – పూర్తి చేయగల విధానం || 2 ||
భూమికిన్ శాంతిదానం – బొందు దేవష్ట జనం – క్షేమము సమాధానం – క్రీస్తు శిష్య కాలమానం || 2 ||
క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై || 2 || (దేవలోక)
సర్వలోక రక్షణార్థం ఈవార్త – చాటించుట ప్రధానం || 2 ||
సర్వలోక రక్షణార్థం – చాటించుట ప్రధానం – సర్వదేవ సన్నిధానం – సర్వలోక కాలమానం || 2 ||
క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై || 2 || (దేవలోక)
దేవలోక సంస్థానం మహోన్నత – దేవుని మహిమస్థానం || 2 ||
దేవలోక సంస్థానం – దేవుని మహిమస్థానం – పావన కీర్తి ప్రధానం – భక్త సంఘ కాలమానం || 2 ||
క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై || 2 || (దేవలోక)
జనక పుత్రాత్మ ధ్యానం నరాళి – జగతి చేయు తీర్మానం || 2 ||
జనక పుత్రాత్మ ధ్యానం-జగతి చేయు తీర్మానం- నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం || 2 ||
క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై || 2 || (దేవలోక)