నీవే కృపాధారము
Nive Krupaadharamu
Hosanna Ministries
18 Dec 2025
నీవే కృపాధారము త్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా || 2 ||
నూతన బలమును నవనూతన కృపను || 2 ||
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా
ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయ పురమైన నీలో నేను || 2 ||
ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి || 2 ||
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయము నిచ్చితివి
ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయ మిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా || 2 || || నీవే ||
సర్వకృపానిధి సీయోను పురవాసి - నీ స్వాస్థ్యముకై నను పిలిచితివి || 2 ||
సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చుదును సహనము కలిగి || 2 ||
శిథిలము కానీ సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వ శక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా || 2 || || నీవే ||
ప్రాకారములను దాటించితివి
ప్రార్ధన వినెడి పావన మూర్తివి || 2 ||
పరిశుద్ధులతో నను నిలిపితివి
నీ కార్యములను నూతన పరచి || 2 ||
పావన మైన జీవన యాత్రలో విజయము నిచ్చితివి
పరమ రాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జాడక స్థిర పరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా || 2 || || నీవే ||