యెడబాయని నీ కృపలో

Yedabayani Ni Krupaalo

Hossanna Ministries 15 Mar 2026
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు || 2 || యెడబాయని నీ కృపలో నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి || 2 || నిత్యములో నను నీ స్వాస్థ్యముగ || 2 || రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు || 2 || యెడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి || 2 || చెదరిన నా హృది బాధలన్నిటిని || 2 || నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు || 2 || యెడబాయని నీ కృపలో అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా || 2 || ఆహా రక్షక నిన్ను స్తుతించెద || 2 || ఆనంద గీతము నేపాడి నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు || 2 || యెడబాయని నీ కృపలో