నీ కృప నాకు చాలును
Ni Krupaa Naku Calunu
Bro. Yesanna Garu
28 Dec 2025
నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను || 2 ||
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట || 2 ||
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా || 2 ||
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా || 2 || ||నీ కృప||
జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా || 2 ||
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే || 2 ||
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను || 2 || ||నీ కృప||