నా జీవం నీ కృపలో

Na Jivam Ni Krupaalo

Bro. Yesanna Garu 18 Nov 2025
నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే || 2 || పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే || 2 || ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే || 2 || నీ బాహు బలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే || 2 || ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచే కలత చెందితినే || 2 || కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే || 2 || ||నా జీవం|| వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే || 2 || వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే || 2 || ||నా జీవం|| స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా || 2 || స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే || 2 || ||నా జీవం||