నాకు నీ కృప చాలును ప్రియుడా
Naku Ni Krupaa Calunu Priyuda
28 Oct 2025
నాకు నీ కృప చాలును ప్రియుడా || 2 ||
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో || 2 ||
నాథా నీ రాక ఆలస్యమైతే || 2 ||
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము || 2 || ||నాకు||
పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను || 2 || ||నాథా||
జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై || 2 || ||నాథా||
పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని || 2 || ||నాథా||