నా కృప నీకు చాలని

Na Krupaa Niku Calani

K Solmon Raju 28 Oct 2025
నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ || 2 || ||నా కృప|| నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని || 2 || నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును || 2 || పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని || 2 || ||నాతో|| పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని || 2 || నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని || 2 || జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని || 2 || ||నాతో||