యేసయ్యా నీ కృపా

Yesayya Ni Krupaa

Bro. Yesanna Garu 16 Nov 2025
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా || నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా || నీ నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా || గువ్వవలె నే నెరిగి నిను చేరనా నీ కౌగిటనే నొదిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా - రాకడలోనే తీరును || యేసయ్యా ||