యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

Yesayya Ni Krupaa Naku Calayya

16 Nov 2025
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా || 2 || యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా || 2 || ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు || 2 || మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప || 2 || ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు || 2 || ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప || 2 || ||యేసయ్యా||