ఎంత కృపామయుడవు యేసయ్యా

Enta Krupaamayudavu Yesayya

Gottipati Yesudasu 28 Oct 2025
ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా || 2 || నలిగితివి వేసారితివి || 2 || నాకై ప్రాణము నిచ్చితివి || 2 || ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం || 2 || మార్చినావు నీ స్వాస్థ్యముగా || 2 || ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము || 2 || ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ || 2 || మరువలేదు నన్ను విడువలేదు || 2 || ప్రేమతో పిలచిన నాథుడవు || 2 || ||ఎంత|| కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ || 2 || వీడను ఎన్నడు నీ సన్నిధి || 2 || నీ త్యాగమునే ధ్యానించెదన్ || 2 || ||ఎంత||