నీ కృపను గూర్చి నే పాడెదా
Ni Krupaanu Gurci Ne Padeda
28 Oct 2025
నీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా || 2 ||
నిత్యము నే పాడెదా
నా ప్రభుని కొనియాడెదా || 2 ||
మహిమా ఘనతా
ప్రభావము చెల్లించెదా || 2 || ||నీ కృపను||
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా || 2 ||
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా || 2 || ||నీ కృపను||
వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా
మరణమే బాలియాగమై నన్ను విడిపించినా || 2 ||
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా || 2 || ||నీ కృపను||