నీ కృప చాలును

Ni Krupaa Calunu

N Raj Prakash Paul 28 Oct 2025
నీ కృప చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు || 2 || నీవు లేని జీవితం అంధకార బంధురం || 2 || నీవు నాకు తోడుంటే చాలును యేసు || 2 || శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో నన్ను కృంగదీయు సంకటములెన్నియో || 2 || నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా || 2 || నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ నా జీవితాంతము నీతోనే నడిచెదన్ నీవు నాకు తోడుంటే చాలును యేసు || 2 || నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన నా హృదయ ఆలాపన అందుకో దేవా || 2 || నిను పోలి నేను ఈ లోకమందు నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ || 2 || నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా || 2 || నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన నా హృదయ ఆలాపన అందుకో దేవా || 2 ||