నీ కృప నిత్యముండును

Ni Krupaa Nityamundunu

Hosanna Ministries 28 Oct 2025
నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా || 2 || నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము || 2 || ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు || 2 || కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా || 2 || ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు || 2 || ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే || 2 || ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు || 2 || రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా || 2 || ||నీ కృప||