మరువలేను – మరువలేను
Maruvalenu - Maruvalenu
12 Jun 2026
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా || 2 ||
నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం || 2 ||
మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా || 2 ||
ఓ ఓ ఓ…. మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
బలి పశువుగ నా పాపము కొరకై
బలియై పోతివయ్యా || 2 ||
నోరు తెరువక భారపు సిలువను
భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా ||యేసయ్యా||
పంచ గాయములలో కారుచున్న రుధిరం
నిను ముంచి వేసెనయ్యా || 2 ||
దోష రహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా
పగబట్టి చంపిరయ్యా ||యేసయ్యా||
ఏ దారి గానక – తిరిగిన నన్ను
నీ దరి చేర్చితివే || 2 ||
మార్గము నీవై సత్యము నీవై
జీవము నీవైతివే
నా సర్వము నీవైతివే ||యేసయ్యా||