ప్రేమగల తండ్రి కృప గల యేసు
Premagala Tandri Krupaa Gala Yesu
Pst T. Jafanya Sastry Garu
06 Dec 2025
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము || 2 ||
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా || 2 ||
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే || 2 || || ప్రేమగల తండ్రి ||
అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే || 2 ||
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా || 2 || || ప్రేమగల తండ్రి ||
నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా || 2 ||
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా || 2 || || ప్రేమగల తండ్రి ||
నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా || 2 ||
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును || 2 || || ప్రేమగల తండ్రి ||
నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా || 2 ||
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా || 2 || || ప్రేమగల తండ్రి ||