ప్రేమ జగతికి మూలం
Prema Jagatiki Mulam
11 Jan 2026
ప్రేమ జగతికి మూలం ప్రేమ దైవ స్వరూపం
ప్రేమ నిత్య జీవం ఆ ప్రేమ మోక్ష మార్గం || 2 || || ప్రేమ జగతికి ||
అమర్యాదగా నడువనిది అవకారం చేయనిది
అన్నిటిని ఓర్చునది అన్నిటికి తాలునది
స్వప్రయోజనము చూడుకొనిది సత్యరూపమే కోపపడనిది
మత్తర పడనిది డంభములేనిది ఉపాంగమిది ప్రేమ ఒక్కటే || ప్రేమ జగతికి ||
దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు
పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మరణమై బలియైనాడు
మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి
ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా చాటించాలి || ప్రేమ జగతికి ||