ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
Asayya.. Chinna Asayya
12 Jun 2026
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని || 2 ||
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా || 2 || ||నీతో||
నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా || 2 ||
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా || 2 ||
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||
సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా || 2 ||
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా || 2 ||
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||