రండి యెహోవాను గూర్చి
Randi Yehovanu Gurchi
12 Jun 2026
రండి యెహోవాను గూర్చి
ఉత్సాహ గానము చేసెదము || 2 ||
ఆయనే మన పోషకుడు
నమ్మదగిన దేవుడని || 2 ||
నమ్మదగిన దేవుడని
ఆహా… హల్లెలూయా ఆహా హల్లెలూయా
కష్ట నష్టములెన్నున్నా
పొంగు సాగరాలెదురైనా || 2 ||
ఆయనే మన ఆశ్రయం
ఇరుకులు ఇబ్బందులలో || 2 ||
ఇరుకులు ఇబ్బందులలో ||రండి||
విరిగి నలిగిన హృదయముతో
దేవ దేవుని సన్నిధిలో || 2 ||
అనిశము ప్రార్ధించిన
కలుగు ఈవులు మనకెన్నో || 2 ||
కలుగు ఈవులు మనకెన్నో ||రండి||
త్రోవ తప్పిన వారలను
చేరదీసే నాథుడని || 2 ||
నీతి సూర్యుండాయనే అని
నిత్యము స్తుతి చేయుదము || 2 ||
నిత్యము స్తుతి చేయుదము ||రండి||