పరలోకమే నా స్వాస్థ్యము
Paralokame Na Svasthyamu
12 Jun 2026
పరలోకమే నా స్వాస్థ్యము
ఎపుడు గాంతునో || 2 ||
నా ప్రియ యేసుని
నేనెపుడు గాంతునో || 2 || ||పరలోకమే||
ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట || 2 ||
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను || 2 || ||పరలోకమే||
సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట || 2 ||
ప్రభు యేసు మహిమ కొరకు
గురి గలిగి జీవింతును || 2 || ||పరలోకమే||
నా పరుగు తుద ముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును || 2 ||
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను || 2 || ||పరలోకమే||
పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను || 2 ||
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును || 2 || ||పరలోకమే||
ప్రియుని పిలుపును విని
నేను కూడా సిద్ధపడెదను || 2 ||
దినములు సమీపించగా
వాంఛయు అధికంబాయె || 2 || ||పరలోకమే||