రండి సువార్త సునాదముతో

Randi Suvarta Sunadamuto

12 Jun 2026
రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి || 2 || ||రండి|| యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతీత పావన నామం భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి|| యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||