దేవుడు మా పక్షమున ఉండగా
Devudu Ma Paksamuna Undaga
Anil Kumar
28 Jan 2026
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము || 2 ||
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 || || దేవుడు మా ||
మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును || 2 ||
తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును || దేవుడు మా ||
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 ||
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు || దేవుడు మా ||
మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము || 2 ||
దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము || దేవుడు మా ||
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 ||
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు || దేవుడు మా ||