ఆత్మ స్వరూపుడా నా

Atma Svarupuda Na

19 Apr 2026
ఆత్మ స్వరూపుడా నా యేసువా - నీ ఆత్మతో నను నింపుమా నీ ఆత్మ శక్తిని - నాకొసగుమా || 2 || పరిశుద్ధాత్మ దేవుడా - నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా - నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా - పరిశుద్ధత నింపుమా || 2 || మండుచున్న పొదలో అగ్నివై - భక్తుడు మోషేను దర్శించిన దేవా కర్మెలు గిరిపై బలి అర్పణపై - దహించు అగ్నిగ దిగిన దేవా || 2 || మమ్మును దర్శించుమా - మాపై దిగిరమ్మయ్యా || 2 || ||పరిశుద్ధ|| ఆది సంఘములో నీ శిష్యులపై - ఆత్మశక్తిని కుమ్మరించితివి నీ కార్యములు గంభీరముగా జరిగించుటకు మమ్ము స్థిరపరచుము || 2 || ఆత్మతో వెలిగించుమా - శక్తిని దయచేయుమా || 2 || ||పరిశుద్ధ|| అంత్య కాలమున మనుష్యులందరిపై - పరిశుద్ధాత్మను నిశ్చయించితివి యెరుషలేము యూదయ సమరయ భూదిగంతముల సాక్షులై యుందుము || 2 || వాగ్దానం నెరవేరగా - ఆత్మశక్తితో పంపుమా || 2 || ||పరిశుద్ధ||