సమీపించరాని తేజస్సులో నీవు
Samipincarani Tejassulo Nivu
17 Dec 2025
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా || 2 ||
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది || 2 || ||సమీపించరాని||
ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే || 2 ||
ఖలునకు కరుణను నొసగితివి || 2 || ||యేసయ్యా||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది || 2 ||
తులువకు విలువను ఇచ్చినది || 2 || ||యేసయ్యా||