నేడు దేవుడునిన్ను
Nedu Devuduninnu
31 Dec 2025
నేడు దేవుడునిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడ మేలుకో
ఇదిగో నేడు రక్షణ దెచ్చినాడు నీకోసమై - మేలుకో - పాపము చాలుకో || నేడు ||
దైవకోపమునుండి - తప్పించు - బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో
తుదకు - నీవు మోక్షముచేరి - నిత్యముండుటకై - ఎత్తుకో - బాలుని హత్తుకో || నేడు ||
నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో నరుడ పుచ్చుకో
మరియు - దురితాలన్ గెల్పించు పరిశుద్ధ బాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో|| నేడు ||
హృదయమును తొట్టెలో - నేయుండుమని మొర్ర - బెట్టుకో మొర్రబెట్టుకో
మనకు - ముదమిచ్చిబ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో - ముద్దుబెట్టుకో || నేడు ||