పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి

Panktiloki Randi Krismasu Panktiloki Randi

31 Dec 2025
పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి || పంక్తి || ఎరుకపరుపలెండి - క్రిస్మసు - నెరుకపరుపలెండి క్రిస్మసు నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం దర కానంద - కరమైనది మీ కొరకై రక్షకుండు - బుట్టెనని ఎరిగించిన గబ్రి - యేలు దూత || పంక్తి || మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి దేవుని మహిమపరుపరండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన మహిమకార్య స-న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని మహిమగ పలికిన - మహిమ దూతల || పంక్తి || దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు ఈ వసుధను లభి - యించును శాంతి ఈ విధముగా వచి - యించిన బుధజన సేవకాళియగు - దేవదూతల || పంక్తి || మనసున జూడండి - బాలుని - మనసునజూడండి - బాలుని మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే మనసున భీతి - యణగిన వారై మనసా నంద - బును గలవారై చని శిశువును చూ-చిన గొల్లల || పంక్తి || చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము చేసికొనుడివార్త = ఆ కాపరుల - యన్నిమాటలు స్వీకరించి మది - చింతనచేయుచు శ్రీ కరజన్మవి - శేషంబులు హృది చేకొని భద్రము - చేసిన యామె || పంక్తి || వింతగా చూడండి శిశువును - వింతగా చూడండి అంత దేవుడు నరుడై వచ్చిన - వింతశిశువును - జూచుచు మదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ చెంతను గూర్చుండిన - యోసేపు || పంక్తి || ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి = రారాజగుని - శ్రాయేల్ రాజౌ ఈ రాజున్న - యింటికి చుక్క దారిచూపగా - జేరి మ్రొక్కుచు ఆరాధించిన - తూరుపుజ్ఞానుల || పంక్తి || మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను గనుక కృతజ్ఞత - గనపరచుటకై మనసున బాహ్యమున - క్రిస్మసు పనులు పూనుకొను - వారి సమాజ || పంక్తి ||