వెండి బంగారాల కన్న
Vendi Bangarala Kanna
13 Jan 2026
వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ || 2 ||
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ || 2 ||
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ || 2 || ||వెండి||
లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ || 2 ||
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ || 2 ||
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా || 2 ||
హల్లెలూయా మహదానందమే || 2 || ||వెండి||
ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ || 2 ||
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ || 2 ||
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా || 2 ||
హల్లెలూయా మహదానందమే || 2 || ||వెండి||